నిహారిక "హ్యాపీ వెడ్డింగ్" షూటింగ్ పూర్తి

Sunday,February 04,2018 - 12:08 by Z_CLU

ఇటీవ‌లే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క తో భాగ‌మ‌తి లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సాధించిన‌  యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా ‘హ్య‌పీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తిచేసుకుంది. 

యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు.  ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌రిక మెట్ట‌మెద‌టి సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌టం విశేషం. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగే చ‌క్క‌టి క‌థ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి ఫిదా లాంటి సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ కి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్బంగా  ఈచిత్రం యెక్క ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేస్తారు. స‌మ్మ‌ర్ లో సినిమా రిలీజ్ ఉంటుంది.