మనసుకు నచ్చిన సినిమాలు చేస్తా

Friday,March 22,2019 - 03:12 by Z_CLU

నిహారిక పెద్ద హీరోల సినిమాల్లో ఎందుకు నటించదు
మెగాఫ్యాన్స్ తో పాటు టోటల్ టాలీవుడ్ ఆడియన్స్ కామన్ డౌట్ ఇది. దీనికి నిహారిక వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం తనకు ముఖ్యం కాదని, కేవలం తన మనసుకు నచ్చిన కథల్లో నటించడమే ముఖ్యమంటోంది నిహారిక.

తనకు చాలా తక్కువ టైమ్ ఉందంటోంది ఈ మెగా డాటర్. 30 ఏళ్లు వచ్చేసరికి తనకు పెళ్లి చేసేస్తారని, ఆ తర్వాత కెరీర్ ఎలాగూ ఉండదు కాబట్టి, ఈ షార్ట్ టైమ్ లో పెద్ద హీరోల సినిమాల కోసం ఎదురుచూడకుండా తన మనసుకు నచ్చి సినిమాలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది.

తన మనసుకు నచ్చి స్క్రిప్టులు ఓ 10 చేసినా చాలంటోంది నిహారిక. అందరి హీరోల్లా తనకు కెరీర్ ను ఎక్కువ రోజులు కొనసాగించాలనే ఆశ లేదంటోంది. ఆమె నటించిన సూర్యకాంతం సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రణీత్ డైరక్ట్ చేసిన ఈ మూవీలో రాహుల్ విజయ్, నిహారిక హీరోహీరోయిన్లుగా నటించారు.