Niharika Konidela - పెళ్లికూతురు ఫంక్షన్

Monday,December 07,2020 - 12:17 by Z_CLU

మరో 2 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది మెగా డాటర్ Niharika Konidela. ఈ బుధవారం (డిసెంబర్ 9వ తేదీ) నిహారిక-చైతన్య పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించి పెళ్లికూతురు ఫంక్షన్ నిన్న గ్రాండ్ గా జరిగింది. మెగా కుటుంబానికి చెందిన ఆడపడుచులంతా నిహారికను పెళ్లికూతురుగా ముస్తాబుచేశారు.

niharika_konidela_pre_wedding_photo_

పెళ్లికూతురు గెటప్ లో నిహారిక మెరిసింది. తన తల్లి నిశ్చితార్థం చీరను పెళ్ళికూతురు చీరగా  ధరించి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది నిహారిక. అలాగే పెదనాన్నతో కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నిహారిక పెళ్లి ఏర్పాట్లను వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. పట్టుచీర, వడ్డారం, బంగారుగాజులు, నగలు పెట్టుకున్న నిహారిక.. సింపుల్ మేకప్ లో కనిపించింది. ఈ ఫంక్షన్ తో పెళ్లి పనులు మొదలైనట్టయింది.

పెళ్లి కూతురు ఫంక్షన్ పూర్తవ్వడంతో మెగా కుటుంబ సభ్యులంతా పెళ్లి కోసం ఉదయ్ పూర్ చేరుకుంటారు. అక్కడే మెహందీ, సంగీత్ ఫంక్షన్ లు నిర్వహించి బుధవారం పెళ్లి తంతు పూర్తిచేస్తారు.

Also Check నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్ !