Niharika Konidela - వైరల్ వెడ్డింగ్ కార్డ్

Thursday,December 03,2020 - 12:35 by Z_CLU

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక-చైతన్య జొన్నలగడ్డ పెళ్లి జరగనుంది. పెళ్లికి సంబంధించి ఇప్పటికే రాజస్థాన్ లోకి ఉదయ్ పూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ రిసార్ట్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Niharika_Konidela_wedding_card

ఈ పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ లుక్ ఇస్తూ డిజైన చేసిన ఈ వెడ్డింగ్ కార్డు చూడ్డానికి చాలా రిచ్ గా ఉంది. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు అందిపోయాయి. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి వెళ్తున్నారు.

Niharika_Konidela_wedding_card 1

 

మరోవైపు Niharika Pre-Wedding Celebrations ప్రారంభమైపోయాయి. ఇప్పటికే తన క్లోజ్ సర్కిల్స్ కు వరుసగా పార్టీలు ఇస్తున్న నిహారిక.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఉదయ్ పూర్ చేరుకుంది.

Niharika_pre_wedding_celebrations

మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ నిహారిక-చైతన్య కలిసి పెద్ద పార్టీ ఇచ్చారు. ఆ స్టిల్స్ ను చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ బ్యాచ్ లో కాబోయే భార్యభర్తలతో పాటు.. వరుణ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, సుశ్మిత, శ్రీజ, కల్యాణ్ దేవ్, బన్నీ వాస్ తదితరులు ఉన్నారు.

Niharika_Chaitanya_jonnalagadda

డిసెంబర్ 9న పెళ్లి తంతు పూర్తయిన వెంటనే అంతా హైదరాబాద్ చేరుకుంటారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. 11వ తేదీన సిటీలోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు.