నిహారిక రెండో సినిమా లాంచ్

Monday,February 20,2017 - 06:32 by Z_CLU

నిహారిక కోలీవుడ్ ఎంట్రీ కన్ఫం అయిపోయింది. విజయ్ సేతుపతి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తో మెగా ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమాకి అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో ‘ఒక మనసు’ లో డీసెంట్ పర్ఫామెన్స్ తో మ్యాగ్జిమం మెగా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసిన నిహారిక, ఆ తరవాత నెక్స్ట్ వెంచర్ కి అంత ఈజీగా సంతకం చేయలేదు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాతో ఇక ఫుల్ ఫ్లెజ్డ్ గా కరియర్ ని ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందీ మెగా ప్రిన్సెస్.

గతంలో మణిరత్నం కడలి సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో నిహారిక పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.