జీ ఎక్స్ క్లూజివ్: 'ఆచార్య'లో మెగా డాటర్

Sunday,April 26,2020 - 12:31 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. త్వరలోనే మరో షెడ్యుల్ జరుపుకోనున్న ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక ఓ క్యారెక్టర్ లో కనిపించనుంది.

రామ్ చరణ్ క్యారెక్టర్ తో వచ్చే ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నిహారిక చరణ్ కి చెల్లెలుగా కనిపించనుందని తెలుస్తుంది. ఇది చిన్న పాత్రే అయినప్పటికీ, మెగాస్టార్ సినిమా కావడంతో నిహారిక కోరిక మేరకు ఆమెను సెలక్ట్ చేశారు.

చిరు ‘సైరా’ సినిమాలో కూడా ఓ రోల్ చేసింది నిహారిక. ఇప్పుడు మరోసారి పెదనాన్న సినిమాలో చాన్స్ కొట్టేసింది. నెక్స్ట్ షెడ్యుల్ లో చరణ్, నిహారిక పై సన్నివేశాలు తీయబోతున్నాడు కొరటాల.

నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్.