గెస్ట్ రోల్ లో నిహారిక ?

Thursday,September 01,2016 - 03:00 by Z_CLU

 

మొదట యాంకర్ గా ఆకట్టుకున్న నిహారిక కొణిదెల ఇటీవలే ‘ఒక మనసు’ చిత్రం తో కథానాయకి గా పరిచయమైనా విషయం తెలిసిందే. తొలి సినిమాతో మెగా అభిమానులను అంతగా ఆకట్టుకోలేక పోయిన ఈ ముద్దు గుమ్మ ఓ ప్రత్యేక పాత్ర తో మెగా అభిమానులను అలరించబోతుందట. ఇక విషయం లోకెళితే మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 150 చిత్రం ‘ఖైదీ నెం150’ సినిమాలో నిహారిక ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తుంది. గతం లోనూ చిరు సినిమాలో ఇలా మెగా కుటుంబం కనిపించి మెగా ఫాన్స్ ను అలరింపజేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం లోనూ నిహారిక తో పాటు మెగా ఫామిలీ లో కొందరు హీరో లు కూడా కనిపించే అవకాశం ఉందంటున్నాయి చిత్ర వర్గాలు.