నిహారిక 'వెడ్డింగ్' కు డేట్ ఫిక్స్

Wednesday,July 11,2018 - 12:33 by Z_CLU

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. అంటే జీవించినంత కాలం ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుని ఎటువంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జీవించాల‌ని అర్ధం. దీనికి ఇరు పెద్ద‌లు కూర్చుని చ‌క్క‌టి ముహుర్తాన్ని నిర్ణ‌యిస్తారు.. ముహుర్తం నిర్ణ‌యించిన ద‌గ్గ‌ర నుండి రెండు కుటుంబాల్లో వుండే హ‌డావుడి, సంతోషాలు, సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ముహుర్తం అంత గొప్ప‌ది.. అలాంటి ముహుర్తాన్ని యువి క్రియెష‌న్స్‌, పాకెట్ సినిమా వారు క‌లిసి సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక ల హ్య‌పివెడ్డింగ్ కి జులై 28 గా నిర్ణ‌యించారు.

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ వ‌రుడుగా…. అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో తెలుగు పిల్ల గా వెండితెరకు పరిచ‌య‌మైన మెగాప్రిన్సెస్‌ నిహ‌రిక కొణిదెల వ‌ధువుగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

న‌టీన‌టులు..
సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..
సమర్పణ – యువి క్రియేష‌న్స్
కెమెరా – బాల్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ – శక్తికాంత్
రీ-రికార్డింగ్ – తమన్
పి.ఆర్‌.ఓ-ఏలూరు శ్రీను
నిర్మాత‌ – పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం – ల‌క్ష్మ‌ణ్ కార్య‌