నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ హడావిడి బిగిన్ అయింది

Tuesday,July 17,2018 - 04:14 by Z_CLU

నిహారిక ‘హ్యాప్పీ వెడ్డింగ్’ హడావిడి స్పీడందుకుంది. జూలై 28 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా యూనిట్, ఈ నెల 21 న  గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ని బట్టి నిహారిక, సుమంత్ అశ్విన్ ల కెమిస్ట్రీ చాలా కన్విన్సింగ్ గా ఉందనిపిస్తుంది. ఈ ఇద్దరి న్యాచురల్ పర్ఫామెన్సెస్ సినిమాకి మరింత ఫ్రెష్ నెస్ ని ఆడ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి సినిమాకి సంబంధించి స్టోరీలైన్ ఏంటనేది సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేయనున్నారు.

లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శక్తికాంత్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాని UV క్రియేషన్స్ & పాకెట్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.