కుడి ఎడమైతే నిధి అగర్వాల్

Friday,August 28,2020 - 06:43 by Z_CLU

హీరోయిన్లంతా ఈ ఖాళీ సమయంలో తమలో దాగున్న టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. మ్యూజికల్ ఇనుస్ట్రుమెంట్స్ వాయించడం, పెయింటింగ్ వేయడం, పాటలు పాడడం, ఓ కొత్త భాష నేర్చుకోవడం, వంటలు చేయడం లాంటివి చాలా చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal) కూడా తనలోని హిడెన్ టాలెంట్ ను బయటపెట్టింది.

ఎవరికైనా కుడిచేయి అలవాటు ఉంటుంది. లేదంటే ఎడమ చేయి అలవాటు ఉంటుంది. కానీ నిధి అగర్వాల్ కు మాత్రం 2 చేతులతో పనిచేయడం అలవాటు. చిన్నప్పట్నుంచి అలా తనకు అలవాటు అయిపోయిందని చెబుతోంది నిధి. అంతేకాదు.. చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కుడిచేయి, ఎడమ చేయితో చక్కగా రాయగలనని అంటోంది.

నెటిజన్లతో మరోసారి ఛాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇలా తనలోని Hidden Talent బయటపెట్టింది. లాక్ డౌన్ టైమ్ లో యాక్టింగ్ క్లాసులు నేర్చుకున్నానని ఇదివరకే ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ.. తన కొత్త సినిమాల అప్ డేట్స్ ను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించింది.