మహేష్ మేనల్లుడితో ఇస్మార్ట్ బ్యూటీ

Friday,November 08,2019 - 04:16 by Z_CLU

ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా వస్తున్నాడు. మహేష్ బాబుకు వరసకు ఇతడు మేనల్లుడు అవుతాడు. ఈనెల 10న అశోక్ కొత్త సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరగనుంది. రామానాయుడు స్టుడియోస్ లో జరగనున్న ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారు మేకర్స్

గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది నిధి. గతంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా ఆమెకు కలిసిరాలేదు. రామ్ సినిమాతోనే ఆమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న నిధి, ఇప్పుడు అశోక్ సినిమాలో నటించడానికి అంగీకరించింది.

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. దేవదాస్ తర్వాత శ్రీరామ్ ఆదిత్య తీయబోతున్న సినిమా ఇదే.