నెక్స్ట్ మణిరత్నం తోనే

Thursday,April 13,2017 - 04:05 by Z_CLU

సూపర్ స్టార్ మానియా బిగిన్ అయింది. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది ఈ లోపు స్పైడర్ క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ జస్ట్ టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ ని కూడా షేక్ చేస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు కనీసం ఫస్ట్ లుక్స్ కి , మీడియా స్పేస్ కి కూడా చాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు తమిళంలో తన నెక్స్ట్ వెంచర్ కి సంబంధించి ఇంటరెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

మురుగదాస్ సినిమాతో తమిళం లో లాంచ్ అవుతున్న సూపర్ స్టార్, తన నెక్స్ట్ తమిళ వెంచర్ గురించి  మాట్లాడాల్సి వచ్చినప్పుడు ‘నెక్స్ట్ తమిళ సినిమా చేస్తే అది మణిరత్నం తోనే’ అన్నాడు. ఈ స్టేట్ మెంట్ ని  మణిరత్నం ఫ్యాన్స్ కూడా ఫీస్ట్ లా రిసేవ్ చేసుకుంటున్నారు.

ఆ మధ్యెప్పుడో మణిరత్నం, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందనే న్యూస్ వినిపించినా, అది సెట్స్ వరకు వెళ్ళలేదు. మళ్ళీ సూపర్ స్టార్ నోట మణిరత్నం పేరు వినగానే, ఈ కాంబోని ఎన్నాళ్ళ నుండో ఎక్స్ పెక్ట్ చేస్తున్న వారిలో కొత్త జోష్ జెనెరేట్ అవుతుంది.