నెక్స్ట్ నువ్వే: టాలీవుడ్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్

Monday,November 06,2017 - 07:05 by Z_CLU

ఆది సాయి కుమార్ హీరోగా V4 మూవీస్ బ్యానర్ పై ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ మూవీకి ప్రేక్షకుల నుంచే కాదు టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

అనిల్ రావిపూడి : నెక్స్ట్ నువ్వే సినిమా కంప్లీట్ గా డిఫెరెంట్ సినిమా అని చెప్పొచ్చు. మామూలుగా హారర్ సినిమా అనగానే డిఫెరెంట్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తాం. కానీ ఈ సినిమా కంప్లీట్ గా సర్ ప్రైజ్ చేసేసింది. ఈ సినిమా అందరూ చూడాల్సిందే. రెండున్నర గంటల పాటు సీట్లో కూర్చొని నేను నవ్వుతూనే ఉన్నాను. నెక్స్ట్ నువ్వే సినిమా టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్.

 

మారుతి :  రిలీజ్ రోజు సినిమా చూడలేకపోయాను. కానీ ఈ రోజు కుదిరింది. నెక్స్ట్ నువ్వే సినిమా ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా చేశారు. టైట్ స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను అద్భుతంగా తీశారు. సినిమా చాలా కొత్తగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా నెక్స్ట్ నువ్వే..

 

నారా రోహిత్ : నెక్స్ట్ నువ్వే మూవీ చూశాను చాలా బావుంది. సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. దర్శకుడు ప్రభాకర్, హీరో ఆదికి కంగ్రాట్స్.

 

అడివి శేష్ : నెక్స్ట్ నువ్వే సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఆది, బ్రహ్మాజీ పెర్ఫామెన్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా.

 

రాజ్ తరుణ్ : నెక్స్ట్ నువ్వే సినిమా చూశాను. నేనైతే జెన్యూన్ గా సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. కథ కొత్తగా ఉంది. దానికి తోడు ఆది ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాడు. ప్రభాకర్ గారు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.

 

శ్రీరామ్ ఆదిత్య : సినిమా చాలా బావుంది. హిలేరియస్ గా ఉంటూనే స్కేరీ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైనింగ్ గా ఉంది.  అందరూ చూడాల్సిన సినిమా.

డార్లింగ్ స్వామి : సినిమా చాలా బావుంది. 2 గంటలు హ్యాప్పీగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. ఆది, బ్రహ్మాజీ, రేష్మి ఎక్స్ టార్డనరీ గా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్ని వాస్ గారికి మంచి బ్రేక్ నిస్తుందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను.