మరో 4 రోజుల్లో 'నెక్ట్స్ నువ్వే'

Monday,October 30,2017 - 11:13 by Z_CLU

వి-4 మూవీస్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన నెక్ట్స్ నువ్వే సినిమా మరో 4 రోజుల్లో విడుదలకానుంది. మొదట్నుంచి ఈ సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న యూనిట్.. ఇప్పుడు ప్రచారాన్ని మరింత పెంచింది. కామెడీ-హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మరింత కొత్తగా ఉంటుందంటున్నారు మేకర్స్. ఆది హీరోగా నటించిన ఈ సినిమాతో తమ బ్యానర్ కు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

ప్రముఖ టీవీ ఆర్టిస్టు, నటుడు ప్రభాకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కింది నెక్ట్స్ నువ్వే సినిమా. ఆది సరసన వైభవి, రేష్మి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు బ్రహ్మాజీ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని అంటోంది యూనిట్.

సాయికార్తీక్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ట్రయిలర్ కూడా హిట్ అవ్వడం యూనిట్ నమ్మకాన్ని డబుల్ చేసింది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది నెక్ట్స్ నువ్వే సినిమా.