మరో వారం రోజుల్లో "నెక్ట్స్ నువ్వే"

Friday,October 27,2017 - 01:53 by Z_CLU

హారర్ కామెడీలో మరో డిఫరెంట్ ప్రయత్నం నెక్ట్స్ నువ్వే. ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా రాబోతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా నటించారు. మరో వారం రోజుల్లో (నవంబర్ 3న) నెక్ట్స్ నువ్వే సినిమా థియేటర్లలోకి రానుంది.

నెక్ట్స్ నువ్వే ట్రయిలర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రయిలర్ ను ఆడియన్స్ పదే పదే చూస్తున్నారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో పాటు కామెడీ సూపర్ గా క్లిక్ అయింది. మరీ ముఖ్యంగా ట్రయిలర్ లో బ్రహ్మాజీ పండించిన హాస్యం సూపర్ హిట్ అయింది. అందుకే నెక్ట్స్ నువ్వేపై అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సంగీతం అందించాడు. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వి-4 మూవీస్ బ్యానర్ పై తొలిప్రయత్నంగా చేస్తున్న ఈ సినిమాకు రిలీజ్ కు ముందే ఇంత బజ్ క్రియేట్ అవ్వడంతో యూనిట్ అంతా ఖుషీగా ఉంది.