రేపే నెక్స్ట్ నువ్వే మూవీ గ్రాండ్ రిలీజ్

Thursday,November 02,2017 - 03:31 by Z_CLU

వి-4 మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘నెక్ట్స్ నువ్వే’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కామెడీ-హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఆది హీరోగా నటించిన ఈ సినిమాతో తమ బ్యానర్ కు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

ప్రముఖ టీవీ ఆర్టిస్టు, నటుడు ప్రభాకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కింది నెక్ట్స్ నువ్వే సినిమా. ఆది సరసన వైభవి, రేష్మి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు బ్రహ్మాజీ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని అంటోంది యూనిట్.

 

సాయికార్తీక్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ‘నెక్స్ట్ నువ్వే’ టీమ్ డిఫెరెంట్ గా ప్రమోట్ చేస్తూ, సినిమా సక్సెస్ కి కావాల్సినంత ఇంట్రెస్ట్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయింది.