1 మిలియన్ వ్యూస్ నెక్స్ట్ ఏంటి...?

Tuesday,January 24,2017 - 03:15 by Z_CLU

ఫస్ట్ టైం రాకింగ్ స్టార్, న్యాచురల్ స్టార్ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే ఎక్స్ పెక్టేషన్స్ సెట్ అయ్యాయి. హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్ కి ముందే అల్టిమేట్ మ్యూజికల్ హిట్ అనిపించుకుంటుంది.

సిచ్యువేషనల్ సాంగ్స్ గా కంపోజ్ అయిన 5 సాంగ్స్ ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని, ముఖ్యంగా యూత్ ని ఓ రేంజ్  లో ఎట్రాక్ట్ చేస్తుంది. అందులో స్పెషల్ గా ‘నెక్స్ట్ ఏంటి’ సాంగ్… యూ ట్యూబ్ లో ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. క్యాచీ లిరిక్స్ తో మెస్మరైజింగ్ ట్యూన్స్ తో సాగిపోయే ఈ సాంగ్ యూత్ కి ఫేవరేట్ హమ్మింగ్ సాంగ్ లా మారిపోయింది.

సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని పాజిటివ్ టాక్ ని కలెక్ట్ చేస్తున్న ‘నేను లోకల్’ ఫిబ్రవరి 3 న రిలీజ్ అవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.