నెక్ట్స్ ఏంటి అంటున్న తమన్న

Saturday,November 17,2018 - 03:19 by Z_CLU

తమన్నా, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’..  బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, ఇటీవలే ఫస్ట్ లుక్ ని, టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ముందుగా కునాల్ గారు దర్శకుడు అనగానే బాలీవుడ్ సినిమా అనుకున్నాను.. కానీ తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని.. కథ వినగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది..సినిమా లో నా లుక్ చాల బాగుంది.. తమన్నా తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది..”

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. “తెలుగు సినిమా రోజు రోజు కి చేంజ్ అయిపోతుంది.. ఈ సినిమాలు ఇండియా మొత్తం తెలిసిపోతున్నాయి.. నేను ముంబై లో పుట్టినా తెలుగు సినిమా నాకు చాల ముఖ్యం.. కునాల్ గారికి బిగ్  వెల్ కం… మీరు మీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను.. డిసెంబర్ లో ఈ సినిమా వస్తుంది..”

నటీనటులు:  తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: కునాల్ కోహ్లీ
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్  (UK)
డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి
సౌండ్ డిజైన్: దారా సింగ్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల
రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్