శుభాకాంక్షలతో 'కాటమరాయుడు'

Wednesday,December 28,2016 - 06:30 by Z_CLU

న్యూ ఇయర్ వస్తుందంటే చాలు అభిమానుల్లో సంతోషం రెట్టింపు అవుతుంది. ప్రతి ఏడాది తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తారు స్టార్ హీరో లు.

అయితే ఈ ఇయర్ అందరి కంటే ముందే ‘కాటమరాయుడు’ పోస్టర్ తో ఆడియన్స్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే కాదు ‘కాటమరాయుడు’ టీజర్ తో మరో సారి అభిమానుల్లో జోష్ నింపి న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నాడు. పంచె కట్టు తో పవన్ నడుస్తున్న పోస్టర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.’నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్ర.లి’ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి లో మరో షెడ్యూల్ జరుపుకోనుంది.