ABCD నుంచి మరో ట్రయిలర్

Tuesday,May 14,2019 - 12:30 by Z_CLU

సినిమాకు సంబంధించి ఇప్పటికే థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది. దానికి 5 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చాయి. ఆ తర్వాత విడుదలైన “మెల్లమెల్లగా..” అనే సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ బజ్ ను మరింత పెంచేలా మరో ట్రయిలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రయిలర్ మరింత ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ట్రయిలర్ కంటే ఇది చాలా బాగుంది. అంచనాల్ని మరింతగా పెంచేసింది.

తాజాగా రిలీజైన ట్రయిలర్ చూస్తుంటే.. ABCD మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది. అల్లు శిరీష్-భరత్ కాంబినేషన్ ఫుల్ కామెడీ పండించినట్టు కనిపిస్తోంది. పైగా హీరోయిన్ రుక్సాన్ కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ABCD. మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమాకు రీమేక్ ఇది. దర్శకుడిగా సంజీవ్ రెడ్డి, సంగీత దర్శకుడిగా జుడా శాండీ ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతున్నారు.