Pawan-Krish Movie - కొత్త సెంటిమెంట్

Wednesday,February 10,2021 - 01:59 by Z_CLU

క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు పవన్ ఫ్యాన్స్. దీనికి వాళ్లు చెబుతున్న రీజన్, నమ్ముతున్న సెంటిమెంట్ కూడా లాజికల్ గా ఉంది.

పవన్-క్రిష్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సంగీత దర్శకుడు చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాకు ఫస్ట్ టైమ్ వర్క్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక రామ్ చరణ్ తో కూడా ఫస్ట్ టైమ్ మగధీరకు వర్క్ చేశాడు. అది కాస్తా ఇండస్ట్రీ హిట్ అయింది.

సో.. ఇప్పుడు పవన్ తో కూడా ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి పవన్-క్రిష్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనేది ఫ్యాన్స్ సెంటిమెంట్. వినడానికి ఈ సెంటిమెంట్ చాలా బాగుంది. నిజమైతే ఇంకా బాగుంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ వేస్తున్నారు. 17వ శతాబ్దంలో చార్మినార్ ఎలా ఉండేదో అలాంటి డిజైన్ తో సెట్ రెడీ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుంది.