Aranya - సంక్రాంతి నుంచి తప్పుకున్న రానా
Wednesday,January 06,2021 - 04:06 by Z_CLU
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ అరణ్య. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరిలో రిలీజ్ చేస్తామని ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఇప్పుడా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. మార్చి 26న రిలీజ్ కాబోతోంది.
తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ను రానా స్వయంగా రివీల్ చేశాడు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు ఈ హీరో. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ, తమిళ్ లో కాండన్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు.
25 ఏళ్లుగా ఒక అడవిలో జీవిస్తూ వస్తున్న ఒక మనిషి కథ ‘అరణ్య’. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చిస్తుంది. ఈ మూవీలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు.
శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది అరణ్య.