గ్యాంగ్‌ లీడర్‌ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,August 09,2019 - 04:34 by Z_CLU

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్‌ సాంగ్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం సెప్టెంబర్‌ లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్‌’ కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతోంది.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ కనిపించబోతున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌
మాటలు: వెంకీ
రచనా సహకారం: ముకుంద్‌ పాండే
పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
వి.ఎఫ్.ఎక్స్.: మకుట
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌