పవన్ సినిమాకు తమన్ మ్యూజిక్

Tuesday,November 08,2016 - 11:18 by Z_CLU

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరియర్ లో ఇప్పుడు పవర్ కూడా ఆడ్ అయింది. దాదాపు అందరు టాప్ హీరోల సినిమాలకు ఇప్పటి వరకు ట్యూన్స్ కంపోజ్ చేసిన తమన్, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించలేదు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోనుంది.

నేసన్ డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్న సినిమాని A.M.రత్నం నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో ఇంకో సినిమాకు ఆల్ రెడీ కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాల తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా నేసన్ సినిమాతో బిజీ అయిపోతాడు పవన్ కళ్యాణ్.

నెక్స్ట్ ఇయర్ కల్లా సెట్స్ పైకి రానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేసినట్టున్నాడు తమన్. అటు సినిమా కన్ఫం అయిందో లేదో ఇటు సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.