కొత్త హీరోయిన్లు - 2016

Tuesday,December 27,2016 - 09:50 by Z_CLU

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి దాదాపు 25 మంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది సిల్వర్ స్క్రీన్ పై సెటిల్ అవుతారు. 2016 లోను చాలా మంది హీరోయిన్స్ లక్ చెక్ చేసుకున్నారు. కానీ అందులో అతి తక్కువ మంది తన సొంత మార్క్ ని సిల్వర్ స్క్రీన్ పై రిజిస్టర్ చేయగలిగారు.

keerthy-suresh-mobile-wallpaper

కీర్తి సురేష్ : ఎక్కడో మలయాళంలో సినిమాలు చేసుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న కీర్తి సురేష్ తెలుగు సినిమాకి పరిచయమైంది 2016 లోనే. నేను శైలజ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైన కీర్తి, ఒక్క సినిమాతోనే బోలెడంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకుంది. అదే స్పీడ్ తో ఇప్పుడు నాని, పవన్ కల్యాణ్ సినిమాలు దక్కంచుకుంది.

anu-emmanuel-desktop-wallpaper-10010

అనూ ఇమ్మాన్యువెల్ : మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు సినిమాకు పరిచయమైన అనూ ఇమ్మాన్యువేల్, ఫస్ట్ సినిమాలోనే నేచురల్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. బేసిగ్గా U.S. సిటిజన్ అయిన అను, 2016 లో లైలాగా ఫుల్ మార్కులే కొట్టేసినా, 2017 ని ఎలా ప్లాన్ చేసుకోనుందో చూడాలి.

niveda-thomas-hd-images-155

నివేద థామస్: Right now టాలీవుడ్ లో… ఎక్కడైనా… టాలెంటెడ్ హీరోయిన్ అనే పదం వినిపిస్తే, ఒక్కసారిగా నివేద థామస్ వైపు తిరిగి చూస్తున్నారు. అదీ 2016 లో రిలీజైన జెంటిల్ మెన్ సినిమా చూపించిన ఇంపాక్ట్. ఈ సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన నివేద, నానితో ఇంకో సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది.

anasuya-latest-hot-photoshoot-pics-3

అనసూయ: అప్పటివరకు యాంకర్ అనసూయ మాత్రమే. కానీ 2016 నుంచి యాక్ట్రస్ అనసూయ. ‘సోగ్గాడే చిన్న నాయనా’ లో బుజ్జిగా…. ‘క్షణం’ సినిమాలో ACP గా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది అనసూయ.

mehreen-pirzada-wallpapers-01871

మెహరీన్ : కృష్ణగాడి వీర ప్రేమగాథ తో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్, ఒక్క సినిమాతోనే 100 కి 100 మార్కులు కొట్టేసింది. 2015 వరకు కనీసం పరిచయం కూడా లేని ఈ పంజాబీ అమ్మాయి, మహాలక్ష్మిగా యూత్ గుండెల్లో పర్మనెంట్ ప్లేస్ ని రిజిస్టర్ చేసుకుంది.

anupama-parameswaran-in-a-aa-_3_

నుపమ పరమేశ్వరన్ : కర్లీ హెయిర్ తో ఎట్రాక్టివ్  స్మైల్ తో మెస్మరైజ్ చేసే అనుపమ పరమేశ్వరన్ 2016 లో తెలుగు సినిమాకి జస్ట్ ఇంట్రడ్యూస్ కాలేదు, ఏకంగా సెటిల్ అయిపోయింది. ఆ… ఆ సినిమాలో నాగవల్లిగా పరిచయమై, నాగచైతన్య ప్రేమమ్ లో కూడా నటించింది. ఇవేకాకుండా శర్వానంద్ తో ‘శతమానం భవతి’ లోను చాన్స్ కొట్టేసిన అను, 2017 కి సరిపడా సినిమాలు ఆల్ రెడీ బ్యాగ్ లో వేసుకుంది.

mannara-chopra-photoshoot-2

మన్నారా చోప్రా : సునీల్ సరసన జక్కన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన మన్నారా చోప్రా, ఆ తరవాత తిక్క సినిమాలోనూ మెరిసింది. మంచి బ్రేక్ కోసం చూస్తున్న మన్నారా.. 2017 లో సక్సెస్ ఫుల్ కరియర్ కి ప్లాన్స్ వేస్తుంది.

aditi-arya-ism-audio-launch-event-hd-image-1

అదితి ఆర్య : కళ్యాణ్ రామ్ ‘ఇజం’ తో తెలుగు సినిమాకి పరిచయమైన అదితి ఆర్య, మాస్ ఆడియెన్స్ లో బాగానే రిజిస్టర్ అయింది. మొదటి సినిమాతోనే కమర్షియల్ హీరోయిన్స్ లిస్టులో  ప్లేస్ కొట్టేసిన ఆదితి, 2017 ని కూడా బడా సినిమాలతో ప్లాన్ చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది.

manjima-mohan-photoshoot-photos-6

మంజిమా మోహన్ : ఓ సినిమా హిట్టయిందంటే క్రేజ్ క్రియేట్ అవ్వడం కామన్. కానీ గౌతమ్ మీనన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన మంజిమా మోహన్, సినిమా రిలీజ్ కి ముందు నుండే  బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది. సాహసం శ్వాసగా సాగిపో తరవాత మరిన్ని సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా కరియర్ ని ప్లాన్ చేసుకుంటోంది.

nanditha1

నందితా శ్వేత :  ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’  సినిమాలో పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన నందితా శ్వేత… తమిళ-మళయాళ భాషలతో పాటు తెలుగులోను బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది.