నిఖిల్ కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Sunday,September 10,2017 - 12:01 by Z_CLU

స్మాల్ గ్యాప్ తర్వాత ఇలా సెట్స్ పైకి వచ్చాడో లేదో అలా హీరోయిన్ విషయాన్ని తేల్చేశాడు నిఖిల్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిన్ననే కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఈ హీరో, సెట్స్ పైకొచ్చిన కొన్ని గంటలకే తన సరసన నటించనున్న హీరోయిన్ ను ఎనౌన్స్ చేశారు. ఆమె పేరు సంయుక్త హెగ్డే.

కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ సినిమాలో సంయుక్త హీరోయిన్. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన సంయుక్తను అదే పాత్ర కోసం తెలుగు రీమేక్ కోసం కూడా తీసుకున్నారు. సంయుక్తకు తెలుగులో ఇదే తొలి సినిమా.

ఈ రీమేక్ లో ఇద్దరు హీరోయిన్లు. ఒక భామగా సంయుక్తను ఫిక్స్ చేసిన యూనిట్, రెండో భామను కూడా ఇప్పటికే డిసైడ్ చేసింది. మరో మంచి రోజు చూసి ఆ ముద్దుగుమ్మ ఎవరో బయటపెడతారు. శరణ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. మరో దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ సమకూరుస్తున్నాడు.