నాని సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Sunday,July 15,2018 - 04:18 by Z_CLU

ప్రస్తుతం నాగార్జున తో కలిసి ‘దేవదాస్’ సినిమా చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.. ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ‘జెర్సీ’ సినిమా చేయబోతున్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తీ సురేష్ పేరు వినిపించగా లేటెస్ట్ గా నాని సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తున్నారని తెల్లుస్తుంది. ఇప్పటికే కొంత మందిని ఆడిషన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా హీరోయిన్ ని ఫైనల్ చేసారని సమాచారం.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో క్రికెట్ ను అమితంగా ఆరాధించే క్రికెటర్ గా నటించనున్నాడు నాని.. ఇందుకోసం త్వరలోనే క్రికెట్ లో ఓ నెల పాటు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.