సరి కొత్తగా .....

Friday,March 10,2017 - 09:04 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్రెష్ కాంబినేషన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు….ఇప్పటివరకూ తమతో నటించని హీరోయిన్స్ ను నెక్స్ట్  సినిమాలకు సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో రొమాన్స్ చేయబోతున్నారు.


‘కాటమరాయుడు’ లో ఓ వైపు శృతి హాసన్ ని రిపీట్ చేస్తూనే నెక్స్ట్ సినిమాలో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ తో నటించడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి అయితే ఫ్రెష్ లుక్ ఉంటుందని భావించిన మేకర్స్ కీర్తి ని ఈ సినిమాకు ఫిక్స్ చేశారు…


సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే హీరోయిన్ అంటే గ్లామరస్ గా ఉండాల్సిందే.. అందుకే ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాలో మహేష్ సరసన పంజాబీ బ్యూటీ రకుల్ ని తీసుకున్నారు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ ఫ్రెష్ జోడీ ఎలా మెస్మరైజ్ చేస్తారా…అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్..

 

ఇక ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫ్రెష్ క్రేజీ కాబినేషన్ అంటే అది చరణ్-సమంతలదే.. ఇప్పటికే టాప్ హీరోయిన్ గా గుర్తింపు అందుకొని ఆల్మోస్ట్ టాప్ హీరోలందరితో పనిచేసిన సమంత, చరణ్ తో నటిస్తున్న తొలి సినిమా కావడం తో సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా పై ఎక్కడలేని హైప్ వచ్చేసింది…


యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాశి ఖన్నాది కూడా ఫ్రెష్ కాంబినేషనే.. ప్రెజెంట్ యంగ్ హీరోలతో నటిస్తున్న ఈ బొద్దుగుమ్మ ఎన్టీఆర్ సరసన ఎలా కనిపిస్తుందో.. వీరిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో.. అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్…


ఇక అల్లు అర్జున్ కూడా ఓ ఫ్రెష్ కాంబినేషన్ ను సెట్ చేసుకొని ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో పూజ హెగ్డే తో కలిసి ఫ్రెష్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ఇప్పటికే టీజర్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనిపించడంతో సినిమాలో వీరిద్దరూ ఎలా ఎంటర్టైన్ చేస్తారా..అని ఎంతో అతృతతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ..