Prabhas - Koratala మరోసారి కలుస్తున్న క్రేజీ కాంబో ?

Thursday,March 31,2022 - 06:09 by Z_CLU

New Buzz : Prabhas, Koratala Siva movie on cards ?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ క్రేజీ కాంబో మూవీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ , కొరటాల శివ ఇద్దరు కలిసి మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినబడుతుంది. ఇటివలే ప్రభాస్ ని కలిసి కొరటాల ఓ స్క్రిప్ట్ చెప్పారట. ప్రభాస్ కి ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఈ కాంబో మూవీ లాక్ అయిపోయిందని అంటున్నారు.

ప్రభాస్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిర్చి’ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. మిర్చి తర్వాత వెంటనే వరుస ప్రాజెక్ట్స్ తో స్టార్ డైరెక్టర్ గా బిజీ అయిపోయడు కొరటాల. ఇక ప్రభాస్ కూడా మిర్చి ఫినిష్ అయిన వెంటనే బాహుబలి ఫ్రాంచైజీ కోసం ఐదేళ్ళు డేట్స్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని చూశారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఫైనల్ గా తమ కాంబినేషన్ లో రెండో సినిమాను లాక్ చేసుకున్నారని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇటివలే మారుతి తో కూడా ఓ సినిమా ఫైనల్ చేసుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వనుందని తెలుస్తుంది. ఇక ‘సలార్’ , ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ స్టేజిలో ఉన్నాయి. కొరటాల కూడా ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తర్వాత బన్నీ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి ఇద్దరూ తమ కమిట్ మెంట్స్ ఫినిష్ చేసుకొని మంచి కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics