నెపోలియన్ దర్శకుడు ఆనంద్ రవి ఇంటర్వ్యూ

Thursday,November 23,2017 - 03:39 by Z_CLU

‘ప్రతినిధి’ సినిమాతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ రవి, ‘నెపోలియన్’ సినిమాతో దర్శకుడిగా టర్న్ అవ్వడమే కాదు, ఈ సినిమాతో హీరోగా కూడా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు ఆనంద్ రవి.. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

 

సినిమా అలా బిగిన్ అయింది…

ప్రతినిధి సినిమా డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన తరవాత, ఎలాగైనా సినిమా చేయాలనే గట్టిగా ట్రై  చేశాను. నెపోలియన్ స్టోరీలైన్ కొత్తగా ఉండటంతో నాకు బిగినింగ్ నుండే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే హీరోగా నేను చేసైనా సరే ఈ సినిమా చేయాల్సిందే అని డిసైడ్ అయి చేసేశాం…

హీరో ఇంకెవరైనా ఉంటే బావుండేది…

నా అల్టిమేట్ గోల్ డైరెక్షనే… ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకో మంచి పాయింట్ తో కథ రెడీ చేసుకుని వేరే హీరోతో సినిమా చేస్తా…

రైటర్ గా రాలేదు…

నా కరియర్ రైటర్ గా బిగిన్ కాలేదు. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల గారి దగ్గర అసోసియేట్ గా చేశాను … ఆ తరవాత ప్రతినిధి సినిమాకి డైలాగ్స్ రాశాను…

అదే కీ పాయింట్ సినిమాలో…

సినిమాలో కీ పాయింట్ నీడ పోవడం. దాన్నే హైలెట్ చేసి ప్రమోషన్స్ కి వాడుకున్నాం. మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది…

రవి వర్మ మంచి సపోర్ట్ ఇచ్చాడు…

నటుడిగా నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా, రవివర్మ పర్ఫామెన్స్ సినిమాకి పెద్ద ప్లస్. కథ మొత్తం ఒక కామన్ మ్యాన్ చుట్టూ తిరుగుతుంటుంది.

ఒపీనియన్ మారిపోయింది…

బిగినింగ్ లో హీరోగా నేనే చేస్తాను అన్నప్పుడు అవసరమా అన్నవాళ్లు, సినిమా చూశాక అప్రీషియేట్ చేయడంతో  కాన్ఫిడెన్స్ వచ్చింది.

కోమలి చాలా బాగా నటించింది…

సినిమా అనుకున్నప్పటి నుండే తెలుగమ్మాయి అయితే బావుంటుంది అనుకున్నాం. కోమలి ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించింది. ఈ సినిమాలో తను డాక్టర్ గా కనిపిస్తుంది.

సినిమాలో మెయిన్ ఎలిమెంట్ అదే…

సినిమాలో ఆద్యంతం కట్టి పడేసే అంశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఒక మర్డర్ మిస్టరీ… అసలా మర్డర్ ఎందుకు జరిగింది..? ఎవరు చేశారు..? అనే పాయింట్ థ్రిల్లింగ్ గా చివరి వరకు కట్టి పడేస్తుంది.

ప్రతినిధి సినిమాలా ఉండదు…

ప్రతినిధి సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా అలా కాదు. ఈ సినిమాలో హీరో కొత్త కాబట్టి మెసేజ్ ఇచ్చినా బోర్ కొడుతుంది. అందుకే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పైనే ఫోకస్ పెట్టాం…