'నేను లోకల్' ఫస్ట్ లుక్ రిలీజ్

Friday,October 28,2016 - 04:13 by Z_CLU

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఈ ఏడాది దీపావళి కూడా ముందున్నానంటూ దూసుకొచ్చాడు. ఈ దీపావళి కి స్టార్ హీరోలు తమ ఫస్ట్ లుక్ తో రెడీ అవుతుంటే ఈ న్యాచురల్ స్టార్ మాత్రం హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం తను నటిస్తున్న తాజా సినిమా ‘నేను లోకల్’ ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా రిలీజ్ చేసాడు నాని.

feature-nenu-local

దిల్ రాజు నిర్మాణం లో త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు యూనిట్..