Nenu Student Sir మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది

Thursday,June 01,2023 - 03:02 by Z_CLU

‘స్వాతిముత్యం’ సినిమాతో అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని  హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ” ‘నేను స్టూడెంట్ సర్’ మంచి సినిమా. చాలా మంచి టెక్నిషియన్స్, నటీనటులు కలసి చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. ప్యాషన్ తో వర్క్ చేసిన టీం కి మంచి సక్సెస్ వస్తే మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు వస్తాయని భావిస్తాను. ఈ సినిమాని థియేటర్ లోకి వచ్చి చూస్తే థ్రిల్ ఫీలవుతారు. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ వుంటుంది. మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. మీ అందరూ థియేటర్ కి వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు రాకేష్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ..”నేను దర్శకుడిగా ఇక్కడ ఉండటానికి కారణం.. పీఆర్వో వంశీ అన్న, శేఖర్ అన్న, నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు. ముందుగా వారికి థాంక్స్. జూన్ 2 ‘నేను స్టూడెంట్ సర్’ రిలీజ్. ఈ సినిమా చూస్తున్నప్పుడు టికెట్ డబ్బులు, రెండు గంటల సమయం వృధా చేశామని ఒక్క శాతం కూడా అనిపించదు. నమ్మండి. ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాని సపోర్ట్ చేయండి.” అన్నారు.

నిర్మాత నాంది సతీష్ వర్మ మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో గొప్పగా సహకరించి వాళ్లే నిర్మాతలుగా భావించి ఎక్కడా వృధా కానివ్వకుండా పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాంది చూసి మంచి సినిమా అని ఎంత ఆనందంగా ఫీలయ్యారో అలాగే  ‘నేను స్టూడెంట్ సర్’ కి కూడా అదే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాను. ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్ వుంటుంది. అందరికీ నచ్చుతుంది” అన్నారు

కృష్ణ చైతన్య మాట్లాడుతూ .. “లాక్ డౌన్ లో ఈ కథ రాసుకున్నాను. సతీష్ గారు నాకు ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన కథ నచ్చడం, గణేష్ గారి కూడా నచ్చడంతో ఇది మొదలైయింది. కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కాలేజీలో వున్నపుడు లెఫ్ట్, రైట్ ఐడియాలజీ అని  మాట్లాడుకుంటారు. కానీ డబ్బులకి వచ్చేసరికి ఏ ఐడియాలజీ ఉండదు. డబ్బే ఒక ఐడియాలజీ అనేది రూట్ కాన్సెప్ట్” అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రవి శివతేజ, అటో రాంప్రసాద్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.