నేను లోకల్ ట్రయిలర్ అదుర్స్

Sunday,January 15,2017 - 10:30 by Z_CLU

మరోసారి నాని మార్క్ కనిపించింది. ఆ డైలాాగ్ డెలివరీ, ఆ ఎనర్జీ, ఆ జోష్… మొత్తం ఒకేసాారి కనిపించింది. నాని నటించిన నేను లోకల్ ట్రయిలర్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది. ట్రయిలర్ లో కామెడీ డైలాాగ్స్, నాని చమక్కులు, నాని-కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన నేను లోకల్ ట్రయిలర్.. సూపర్ హిట్ సినిమాలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. నిన్నంతాా కుర్రాళ్లు నెట్, యూట్యూబ్, మొబైల్స్ లో ఈ సినిమా ట్రయిలరే చూశారు.

నాని-కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ సినిమాకు త్రినాథరావు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా కాకినాడలో నిర్వహించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆద్యంతం ఆకట్టుకుంది. నాని, కీర్తి సురేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.