నేను లోకల్ థర్డ్ వీక్ కలెక్షన్స్

Monday,February 20,2017 - 08:40 by Z_CLU

న్యాచురల్ స్టార్ సినిమాకి కలెక్షన్స్ కూడా న్యాచురలే అని ప్రూఫ్ చేస్తుంది బాక్సాఫీస్. ఇటు లోకల్ థియేటర్స్ నుండి అటు ఓవర్ సీస్ వరకు రిలీజైన ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న నేను లోకల్ ఇప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం స్లో పేజ్ లోకి ఎంటర్ కాలేదు.

ఫిబ్రవరి 2 న రిలీజైన ‘నేను లోకల్’ మూడు వారాల్లోనే  30 కోట్ల షేర్ వసూలు చేసేసింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా, యూత్ ని రిపీటెడ్ గా థియేటర్స్ కి రప్పించుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నాని, కీర్తి సురేష్ ఫ్రెష్ కాంబినేషన్ ఫ్యాన్స్ నచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ అయితే, దేవి శ్రీ ప్రసాద్ సిచ్యువేషనల్ సాంగ్స్ సినిమా సక్సెస్ కి పెద్ద ఎసెట్ అయ్యాయి.