'నేను లోకల్' రిలీజ్ డీటెయిల్స్

Monday,December 12,2016 - 06:00 by Z_CLU

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమా తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా త్రినాధ్ రావు నక్కి డైరెక్షన్ లో ప్రెజెంట్ నాని నటిస్తున్న ‘నేను లోకల్’ సినిమా జనవరి లో రిలీజ్ కి రెడీ అవుతుంది.

నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా  షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసిన మేకర్స్ ఆ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమాను జనవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట ప్రొడ్యూసర్ దిల్ రాజు. అన్ని కుదిరితే ఈ సినిమాను జనవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.