'నేను లోక‌ల్' రిలీజ్ డేట్

Friday,January 20,2017 - 05:20 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్ననేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా తెరకెక్కిన `నేను లోక‌ల్‌` రిలీజ్ కి రెడీ అయింది. `యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌ తో లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ను ఫిబ్రవరి 3 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడం తో ‘సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్’ అంటూ ‘నేను లోకల్’ తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు నాని.

ఇప్పటికే ఎంటర్టైనింగ్ డైలాగ్స్ తో కూడిన థియేట్రికల్ ట్రైలర్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, కీర్తి సురేష్ నాని కెమిస్ట్రీ సినిమా పై భారీ అంచనాలు పెంచడం తో ఆ అంచనాలను ఈ సినిమా తప్పకుండా అందుకొని ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం అంటున్నారు చిత్ర యూనిట్.