"నేను లోకల్" ప్రీ-రిలీజ్ బిజినెస్

Tuesday,January 31,2017 - 06:03 by Z_CLU

నేచురల్ స్టార్ నాని నటించిన ‘నేను లోకల్’ రిలీజ్ కి రెడీ అయింది. దిల్ రాజు బ్యానర్ లో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో అదరగొట్టేసింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇంత భారీగా జరగడానికి 5 రీజన్స్ ఉన్నాయి.

nani-nenu-local-reason-1
ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోవడానికి మెయిన్ రీజన్ నాని. వరుస హిట్స్ తో ఊపుమీదున్న నేచురల్ స్టార్… నేను లోకల్ సినిమాకు పిల్లర్ గా నిలిచాడు. ట్రయిలర్ లో నాని చెప్పిన మార్చి-సెప్టెంబర్ డైలాగ్ ఇప్పటికే పెద్ద హిట్. నాని సినిమా కచ్చితంగా చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే నేను లోకల్ సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ జరిగింది.

nani-nenu-local-reason-2
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా జరగడానికి మరో రీజన్ దిల్ రాజు బ్రాండ్. నిర్మాతగా ప్రతీ సినిమాపై దిల్ రాజు మార్క్ ఉంటుంది. అసలు దిల్ రాజు ఓ ప్రాజెక్టు టేకప్ చేశాడంటేనే అది సంథింగ్ స్పెషల్ మూవీ అయి ఉంటుంది. రీసెంట్ గా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ హిట్. ఆ ట్రాక్ రికార్డు కూడా నేను లోకల్ సినిమా బిజినెస్ పెరగడానికి కారణం. పైగా తాజాగా దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టడంతో, నేనులోకల్ మార్కెట్ ఆటోమేటిగ్గా పెరిగిపోయింది.

nani-nenu-local-reason-3
‘నేను లోకల్’ సినిమాను రిలీజ్ కి ముందే తన మ్యూజిక్ తో హిట్ రేస్ లో నిలబెట్టాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్. నెక్ట్స్ ఏంటి సాంగ్ తో పాటు దాదాపు అన్ని పాటలు ఇప్పటికే హిట్ అయిపోయాయి. అలా నేను లోకల్ సినిమా విడుదలకు ముందే యూత్ కు కనెక్ట్ అయిపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరగడానికి ఇది కూడా ఓ కారణం.

nani-nenu-local-reason-4
రిలీజ్ కి ముందే సినిమా బిజినెస్ స్పీడ్ గా జరిగిపోవడానికి మరో రీజన్ కీర్తి సురేష్. తెలుగులో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన ‘నేను శైలజ’ సూపర్ హిట్ సాధించడం, పైగా ప్రస్తుతం యూత్ లో ఈ భామకి మంచి ఫాలోయింగ్ ఉండడం… నేను లోకల్ సినిమాకు ప్లస్ అయింది. మరీ ముఖ్యంగా టీజర్ లో నాని-కీర్తిసురేష్ మధ్య కెమిస్ట్రీ చూసిన బయ్యర్లు సినిమా షూర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.

nani-nenu-local-reason-5
ఈ సినిమా మార్కెట్ పెరగడానికి డైరక్టర్ త్రినాథరావు కూడా ఓ కారణం. ఎందుకంటే, ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ మూవీ సినిమా చూపిస్త మావ సూపర్ హిట్ అయింది. అందుకే నేను లోకల్ పై కూడా అంచనాలు పెరిగాయి. మరీ ముఖ్యంగా యూత్ ఈ సినిమాను స్పెషల్ గా చూస్తున్నారు.