2 మిలియన్ వ్యూస్ దాటిన నేను లోకల్ జ్యూక్ బాక్స్

Thursday,February 09,2017 - 01:46 by Z_CLU

థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం ఆగట్లేదు, ఇటు యూ ట్యూబ్ లో జ్యూక్ బాక్స్ కి రికార్డ్ అవుతున్న వ్యూస్ స్పీడ్ తగ్గడం లేదు. నాని సూపర్ హిట్ కరియర్ లోనే ది బెస్ట్ ఎంటర్ టైనర్ గా స్పెషల్ ట్యాగ్ కట్టేసుకున్న ‘నేను లోకల్’ ఫీవర్ థియేటర్స్ లోనే కాదు సోషల్ మీడియాలోను ఏ మాత్రం సన్నగిల్లడం లేదు.

 దేవి శ్రీ ప్రసాద్కంపోజ్ చేసిన ట్రెండీ సాంగ్స్, అందునా స్పెషల్ గా ‘నెక్స్ట్ ఏంటి ..?’ సాంగ్, ఆ తరవాత మెలోడియస్ గా ట్యూన్ అయిన ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం..’ సాంగ్స్ కి యూత్ మ్యాగ్జిమం ఎడిక్ట్ అయిపోయారు.

ఓవరాల్ గా 20 కోట్లు ఆల్ రెడీ వసూలు చేసేసిన ‘నేను లోకల్’ ఇప్పటికీ అదే స్ట్రెంత్ తో థియేటర్స్ లో ప్రదర్శించబడుతుంది. న్యాచురల్ స్టార్ నాని, రాక్ స్టార్ DSP ఫస్ట్ టైం కలిసిన ఈ కాంబో మొత్తానికి సూపర్ సక్సెస్ అనిపించుకుంటుంది.