'నేను లోక‌ల్' సెన్సార్ పూర్తి

Monday,January 30,2017 - 05:14 by Z_CLU

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందిన ‘నేను లోక‌ల్‌’. ‘యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌’ అనేది క్యాప్ష‌న్‌ తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ అందుకొని ఫిబ్రవరి 3 రిలీజ్ కి రెడీ అయింది.

సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న నాని ఈ సినిమాలో  బాబు అనే క్యారెక్టర్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెకెక్కిన ఈ సినిమాలో కీర్తి గ్లామరస్ యాక్టింగ్, డి.ఎస్.పి మ్యూజిక్, ప్రసన్న రాసిన డైలాగ్స్ తో పాటు నవీన్ చంద్ర క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అన్నారు యూనిట్.