కలెక్షన్స్ తో అదరగొట్టేశాడు

Wednesday,March 15,2017 - 09:30 by Z_CLU

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా ‘నేను లోకల్’ రిలీజ్ డే నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయిందనే విషయం ప్రత్యేకంగా చెప్పు కోనక్కర్లేదు.. నాని కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 58 కోట్ల గ్రాస్ అందుకోగా 34 కోట్ల షేర్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.


యూత్ ఫుల్ స్టోరీలైన్, నాని-కీర్తి కెమిస్ట్రీ, డైలాగ్స్, దేవిశ్రీ సాంగ్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచి యూత్ ని రిపీటెడ్ గా థియేటర్స్ కి రప్పించాయి.. సో ఫైనల్ గా 34 కోట్ల షేర్ సాధించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని కి ఓ స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది నేను లోకల్.