నేను లోకల్ ఆడియో రివ్యూ

Monday,January 16,2017 - 04:18 by Z_CLU

నేచురల్ స్టార్ నాని, రాక్ స్టార్ DSP ఫస్ట్ టైం టీం కట్టారు. సో… నేచురల్ గానే ఆడియో రాక్స్. సంక్రాంతి గిఫ్ట్ లా మనముందుకొచ్చిన నేను లోకల్ మ్యూజిక్ లో సర్ ప్రైజింగ్  ఎలిమెంట్స్ ఏంటో… ఓ లుక్కేద్దాం.

నెక్స్ట్ ఏంటి..? : ఎవరైనా కొత్తగా ట్రై చేస్తుంటారు… మన DSP కొంచెం వేరు… ఆల్రెడీ జనాలకు అలవాటు పడిన ఎలిమెంట్స్ ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇక్కడా అదే చేశాడు. ప్రతి యూత్.. నాట్ జస్ట్ యూత్ అందరూ ఫేస్ చేసే నెక్స్ట్ ఏంటి..? ఎలిమెంట్ కి మాంచి ట్యూన్ కట్టి ప్రెజెంట్ చేశాడు.. ఈ సాంగ్ విన్నవారెవరైనా ముందు కనెక్ట్ అవుతారు.. ఆ తర్వాతఎంజాయ్ చేస్తారు. ఆడియో రిలీజ్ కు ఒక రోజు ముందే ఈ సింగిల్ ను రిలీజ్ చేశారంటే.. యూనిట్ కాన్ఫిడెన్స్ అర్థంచేసుకోవచ్చు.

అరెరే ఎక్కడ..? : చిన్న చిన్న పదాలు… పలకడానికి ఈజీగా.. మరీ హై పిచ్ లో లేని ట్యూన్స్ కాబట్టి పాడుకోవడానికి ఈజీగా…. మెస్మరైజింగ్ మెలోడీ కాబట్టి… హమ్ చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడే పని లేకుండా… ట్యూన్ అయిన ఈ సాంగ్ ని, విన్నవాళ్ళు ఎవరైనా ఇంకోసారి రిపీట్ చేసుకుంటారు. ఆ వెంటనే హమ్ చేసుకుంటారు.

డిస్టబ్ చేస్తా నిన్ను : ఈ పాట సినిమాలో హీరో ఆటిట్యూడ్ ని ఎలివేట్ చేస్తుంది. హీరోయిన్ ని టీజ్ చేసే సిచ్యువేషన్ లో ఉండే ఈ పాట, హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ ఫర్ యూత్ ఓన్లీ. క్యాచీ లిరిక్స్… కొత్తగా అనిపించే ట్యూన్స్ సింప్లీ సూపర్బ్.

చంపేసావే నన్ను :  స్లో పేజ్ లో స్టార్ట్ అయి.. ఒకేసారి ఫాస్ట్ పేజ్ లోకి ఎంటర్ అవుతుందీ సాంగ్. రొమాంటిక్ కంటెంట్ తో ట్యూన్ అయిన సూపర్ హిట్ డ్యూయట్.

సైడ్ ప్లీజ్ : నేచురల్ రాకింగ్ కాంబోలో ఇది మరో యూత్ ఓరియంటెడ్ సాంగ్. సైడ్.. సైడ్.. సైడ్.. ప్లీజ్ అంటూ బిగిన్ అయ్యే ఈ పాట.. యూత్ కి ఫాస్ట్ పేజ్ లో కనెక్ట్ అవుతుంది. ఇంటరెస్టింగ్ లిరిక్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న మాస్ నంబర్.

జీ-సినిమాలు రివ్యూ : సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే కాన్సంట్రేషన్ ని తనవైపు తిప్పుకున్న ‘నేను లోకల్’ ఈ ఆడియో రిలీజ్ తో ఫ్యాన్స్ లో మరింత తొందరని పెంచేసింది. సాంగ్స్ అన్నీ ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తూ.. మూవీపై హైప్ ను డబుల్ చేశాయి. నేను లోకల్ సినిమాకు ఈ సాంగ్స్ పెద్ద ఎసెట్ అవ్వడం ఖాయం.