రేపే `నేను లోక‌ల్` ఆడియో రిలీజ్

Friday,January 13,2017 - 03:12 by Z_CLU

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌`, `జెంటిల్ మ‌న్‌`, మ‌జ్ను`..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో “సినిమా చూపిస్తా మామా” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.”ఆటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌…క్యాప్ష‌న్‌.

nenu-local

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల గురించి …. చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ – “నేను లోక‌ల్ చిత్రంలో సరికొత్త నానిని చూస్తారు. డైరెక్ట‌ర్ త్రినాథ్ త‌న‌దైన స్టైల్ల్లో, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్‌తో రూపొందిస్తున్న ల‌వ్ స్టోరి ఇది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం కాకినాడ‌లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది“ అన్నారు.