నేను లోకల్ ఎట్రాక్షన్స్

Thursday,February 02,2017 - 09:03 by Z_CLU

నేచురల్ స్టార్ నాని లోకల్ థియేటర్స్ లో హంగామా స్టార్ట్ చేయడానికి ‘నేను లోకల్’ సినిమాతో రెడీ అయ్యాడు. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మాణం లో త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. రిలీజ్ కి ముందే అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని స్పెషల్ ఎట్రాక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

attraction_1
ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ నాని అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కలేదు. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న నాని నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

attraction_2

దిల్ రాజు బ్యానర్ లో సినిమా వస్తుందంటే చాలు అటు యూత్ పాటు మాస్, ఫామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కడతారు అదీ దిల్ రాజు బ్రాండ్ కున్న వాల్యూ. మరి అలాంటి దిల్ రాజు బ్యానర్లో నాని నటించిన సినిమా వస్తుందంటే ఆ క్రేజ్ మరింత రెట్టింపు అవుతుందనడం లో ఎటువంటి డౌట్ లేదు.

attraction_3
ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ సాంగ్స్. మ్యూజిక్ సెన్సేషన్ దేవి అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ కి ముందే అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ‘నెక్స్ట్ ఏంటి’ అనే పాట సినిమా పై మరింత హైప్ పెంచేసింది.

attraction_4
కీర్తి సురేష్ ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులో మంచి ప్లేస్ సొంతం చేసుకున్న కీర్తి నటించిన రెండో సినిమా కావడం తో ఈ అమ్మడిని మళ్ళీ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

attraction_5
ఇటీవలే ‘సినిమా చూపిస్త మావ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రినాధ్ రావు ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్. గతంలో లవ్ ఎంటర్టైన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

attraction_6
ఈ సినిమాలో ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన డైలాగ్స్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్షన్ చేస్తున్నాయి. ట్రైలర్ లో ‘ఒకమ్మాయి తెల్లవారి జామున నాలుగింటికి లేచి చదువుకుంటుందంటే అది మార్చి అని అర్ధం, ఒక అబ్బాయి తెల్లవారి జామున నాలుగింటికి లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్ధం.’ అనే డైలాగ్ తో పాటు ‘పరిగెత్తి పరిగెత్తి బతికే దాన్ని జింక అంటారు ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు’ అనే డైలాగ్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

attraction_7
ఇక ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ కామెడీ. నానితో పాటు కొంతమంది కమెడియన్స్ చేసే కామెడీ సినిమాకు హైలెట్ అనే టాక్ ఆడియన్స్ ను మరింత ఎట్రాక్ట్ చేస్తుంది.

attraction_8
లవ్ స్టోరీస్ తో ఎన్ని సినిమాలు వచ్చిన కంటెంట్ ఉంటే మళ్ళీ చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రెజెంట్ అలాంటి లవ్ స్టోరీ తోనే ఈ సినిమా తెరకెక్కిందని యూనిట్ చెప్తుండడం, పైగా ట్రైలర్, సాంగ్స్ ఈ విషయాన్నీ రుజువు చేయడంతో ఈ సినిమా లవ్ స్టోరీస్ ను అమితంగా ఇష్టపడే వారిని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.

attraction_9

ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ పోసాని. ప్రెజెంట్ తన కామెడీ టైమింగ్, డైలాగ్స్ తో థియేటర్స్ లో నవ్వులు పువ్వులు పూయించి ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తున్న పోసాని ఈ సినిమాలో నానికి నాన్నగా నటించడం తో ఈ సినిమాలో పోసాని లోకల్ కామెడీ కి ఏ మాత్రం లోటుండదని రుజువు చేస్తుంది.

attraction_10
ఇక లోకల్ కాలేజీ స్టూడెంట్ గా ఈ సినిమాతో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు నాని. గతం లో ‘పిల్లజమీందార్’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించి యూత్ తో పాటు అందరినీ ఎంటర్టైన్ చేసిన నాని ఈ సినిమాలో కూడా ఓ కాలేజీ స్టూడెంట్ కనిపించి అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతున్నాడని అంటున్నారు యూనిట్.