మార్చ్ 17న 'నేనోరకం' రిలీజ్....

Wednesday,March 01,2017 - 04:03 by Z_CLU

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ‘నేనోరకం’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది… లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చ్ 17 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..


ఇప్పటికే టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై అంచనాలు పెంచడం తో ‘నేనోరకం’ అంటూ కచ్చితంగా ఓ సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రామ్ శంకర్..ఈ సినిమాలో రామ్ శంకర్ యాక్షన్ తో పాటు శరత్ కుమార్ యాక్షన్ కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తుందంటున్నారు యూనిట్. సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా తో రామ్ శంకర్ టాలీవుడ్ ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేస్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…