‘నేనే రాజు నేనే మంత్రి’ కాజల్ బర్త్ డే స్పెషల్ టీజర్

Monday,June 19,2017 - 03:23 by Z_CLU

రానా హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సెకండ్ టీజర్ రిలీజయింది. ఈ సినిమాలో  హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా రిలీజయిన ఈ టీజర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆజల్ అగర్వాల్ బర్త్ డే విషెస్ తో పాటు ట్రెండ్ అవుతుంది.

కో ఇన్సిడెంటా లేకపోతే పక్కా ప్లానింగ్ తో జరిగిందా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ, కాజల్ అగర్వాల్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ తేజ డైరెక్షన్ లోనే తన 50 వ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఫీలవుతుంది కాజల్ అగర్వాల్.

‘నా పేరు రాధా జోగేంద్ర… రాధ లేనిదే జోగేంద్ర లేడు..’ అనే డైలాగ్ తో క్లోజ్ అవుతున్న టీజర్ ఇంప్రెసివ్ గా ఉందనే ఒపీనియన్ ని కలెక్ట్ చేసుకుంటుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.