ఎట్రాక్ట్ చేస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’

Tuesday,June 06,2017 - 01:49 by Z_CLU

బాహుబలిలో భళ్లాలదేవుడిలా సమస్త మాహిష్మతి సామ్రాజ్యాన్ని గడగడలాడించిన రానా, మరో మాస్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిపోయాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ‘జోగేంద్ర’ అనే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

గతంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో పొలిటికల్ ఎంటర్ టైనర్ తో, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రానా, మళ్ళీ ఇన్నాళ్ళకు మరో పొలిటికల్ థ్రిల్లర్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. రానా సరసన కాజల్, క్యాథరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.