ఈ నెల 16న నెల్లూరి పెద్దారెడ్డి రిలీజ్

Saturday,March 10,2018 - 12:16 by Z_CLU

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది.

చిత్ర నేపథ్యం భావోద్వేగాలతో ఉన్నా…కథనం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నెల్లూరి పెద్దారెడ్డి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నెల 16న నెల్లూరి పెద్దారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం.