నేలటిక్కెట్టు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,May 28,2018 - 06:51 by Z_CLU

రవితేజ లేటెస్ట్ మూవీ నేలటిక్కెట్టు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మాళవిక శర్మ టాలీవుడ్ కు పరిచయమైంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతం అందించాడు. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 6 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 2.38 కోట్లు
సీడెడ్ – రూ. 1.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.90 కోట్లు
ఈస్ట్ – రూ. 0.63 కోట్లు
వెస్ట్ – రూ. 0.42 కోట్లు
గుంటూరు – రూ. 0.65 కోట్లు
కృష్ణా – రూ. 0.46 కోట్లు
నెల్లూరు – రూ. 0.28 కోట్లు