బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ హీరో

Wednesday,March 14,2018 - 12:37 by Z_CLU

సాక్ష్యం సినిమా కంప్లీట్ చేసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వలేదు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. వంశీధార క్రియేషన్స్ బ్యానర్ పై మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడీ సినిమాలో మరో ప్రముఖ నటుడు వచ్చి చేరాడు. అది కూడా బాలీవుడ్ నటుడు కావడం విశేషం. అతడే నీల్ నితిన్ ముఖేష్.

ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాలో నీత్ నితిన్ ముకేష్ విలన్ గా చేస్తున్నాడు. సో.. బెల్లంకొండ సినిమాలో కూడా ఇతడికి విలన్ క్యారెక్టర్ ఇచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు. కానీ అది తప్పు. బెల్లంకొండ సినిమాలో హీరోతో పాటు ఉండే ఓ పవర్ ఫుల్ పాత్రలో నీల్ నితిన్ కనిపించబోతున్నాడు.

శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. నవీన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వాళ్ల పేర్లను త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు.ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.