`గౌతమిపుత్రశాతకర్ణి` కోసం నీతా లుల్లా పరిశోధన

Saturday,July 16,2016 - 10:35 by Z_CLU

 

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్,మూడు జాతీయ అవార్డుల విజేత నీతా లుల్లా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

`గౌతమిపుత్ర శాతకర్ణి` సినిమా కోసం నీతా దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన  చేశారు. అందుకోసం ఆవిడ చాల రీసెర్చ్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందని సంస్కృతి, సంప్రదాయాలను స్టడీ చేస్తున్నారు. అలాగే ఇండియాలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్ తో అభరణాలకు సంబంధించిన మోడల్స్ ను గీయించి అభరణాలను తయారుచేస్తున్నారు.

చాలా అన్వేషణ తర్వాత ప్రతి క్యారెక్టర్ కు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాను. అలాగే అమరావతి నగర నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నాను. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానని నీతా లుల్లా తెలియజేశారు.

చిత్ర నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి విజుల్ గ్రాండ్ గా ఉండాలని ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ,శ్రేయ, హేమామాలిని వంటి ప్రధాన తారాగణం లుక్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.